సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోంది: మాజీ మంత్రి తలసాని

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందని చెప్పారు.

సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోంది: మాజీ మంత్రి తలసాని
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం పోరాటం ర్యాలీ జరుగుతుందని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యారడైజ్, మంజు థియేటర్ మీదుగా MG రోడ్ లోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఈ ర్యాలికీ సికింద్రాబాద్ లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇతర ప్రాంతాల నుండి ఇంటికి ఒకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు.

220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అని అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్ లో ఇమిడి ఉన్నాయని తెలిపారు. లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని, సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఓ వైపు ముఖ్యమంత్రి సికింద్రాబాద్ ను టచ్ చేయలేదని చెబుతున్నారని మరి నార్త్ జోన్ ఆఫీస్ ఎందుకు మల్కాజ్ గిరిలో కలిపారో చెప్పాలని ప్రశ్నించారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు మల్కాజ్ గిరి కమిషనరేట్ లో పనిచేస్తుందో చెప్పాలన్నారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయం అని అన్నారు.

Next Story