- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ మోసం చేసింది: తలసాని
ఇది ప్రజా ప్రభుత్వం కాదని దగా ప్రభుత్వమని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆయన ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సర్పంచ్ ఎన్నికలలో 17.08 శాతం సీట్ల కేటాయించడం దారుణమన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఇది ప్రజా ప్రభుత్వం కాదని దగా ప్రభుత్వమని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బుధవారం ఆయన ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో మాట్లాడారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు సర్పంచ్ ఎన్నికలలో 17.08 శాతం సీట్ల కేటాయించడం దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మోసం, దగా చేసిందని దుయ్యబట్టారు. బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో బిల్లుకు తాము మద్దతు తెలిపామని అన్నారు. బిల్లును రాష్ట్రపతికి పంపి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని ఆరోపించారు.
ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, కేసీఆర్ హయాంలోనూ బిల్లులను ఆమోదించి పంపించారని తెలిపారు. 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే చట్టబద్ధత లభిస్తుందని ప్రభుత్వానికి విన్నవించినా స్పందించలేదన్నారు. బిహార్ ఎన్నికలలో తెలంగాణ ఆదర్శం అంటూ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేశారని.. కామారెడ్డి సభలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. బీసీలు ఎంతో చైతన్యవంతులు అయ్యారని.. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. రానున్న రోజులలో బీసీల ఆగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ చవిచూస్తదని హెచ్చరించారు. బీసీ వర్గాలే కాకుండా అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌ను బొందపెట్టి తీరుతామని అన్నారు.






