BRS: అది మా నాయకుడు కేసీఆర్ ఘనతే.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.

BRS: అది మా నాయకుడు కేసీఆర్ ఘనతే.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హోమ్ గార్డుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి గుడ్‌న్యూస్‌లు చెబుతుందని అనుకున్నాను. కానీ రూ.1000 జీతం పెంచి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడే హోంగార్డులకు ప్రభుత్వ భీమా సౌకర్యం కల్పించామని అన్నారు. అప్పుడే రూ.9 వేల జీతం ఉండేది.. దానిని తాము 20 వేలకు పెంచి, తరువాత పీఆర్సీ 30 శాతం పెంచామని వెల్లడించారు. హోంగార్డుల(Home Guards)కు జీతాలు పెంచిన ఘనత తమ నాయకుడు కేసీఆర్‌దే అని కొనియాడారు.

ట్రాఫిక్ పొలీస్ స్టేషన్‌(Traffic Police Station)లలో పనిచేసే వారికి 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇచ్చామని అన్నారు. పోలీసులతో సమానంగా డ్రెస్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. వారిని రెగ్యులరైజ్ చేయాలని రాజీవ్ త్రివేది నేతృత్వంలో కమిటీ వేశామని తెలిపారు. నిన్న వారికి ప్రభుత్వ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్‌లుగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తారు అనుకున్నాం.. చనిపోయిన వారికి కారుణ్య నియామకాల ఉద్యోగాలు ఇస్తారు అనుకున్నాం కానీ ఏదీ చేయలేదని అన్నారు. చనిపోయిన హోం గార్డుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్షగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన హోమ్ గార్డులకు కూడా బెనిఫిట్స్ ఇవ్వాలని అన్నారు.

Next Story