- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ పాలసీపై మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంచలన ఆరోపణలు
తెలంగాణ లిక్కర్ పాలసీపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మద్యం షాపు దరఖాస్తు ధర పెంచాలని చూస్తున్నారన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ లిక్కర్ పాలసీపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మద్యం షాపు దరఖాస్తు ధర పెంచాలని చూస్తున్నారన్నారు. రూ.2 లక్షల నుండి రూ.3 లక్షలకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. లిక్కర్ పాలసీ గడువు ముగియకముందే కొత్త షాపులకు దరఖాస్తులను ఆహ్వానించాలని చూస్తున్నారని ఆరోపించారు. అన్ని గ్రామాల్లో మద్యం షాపులు తెరుస్తున్నారని తెలిపారు. మద్యం మాఫియాను పెంచి పోషించి, కల్లు దుకాణాలు మూసివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
కల్తీ కల్లు పేరుతో కుట్ర చేస్తున్నారని అన్నారు. కల్తీ అనేది ఎక్కడా లేదని కేవలం కల్లులోనే ఉందని బూచీగా చూపించే ప్రయత్నం జరుగుతుందన్నారు. కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటన తమను కూడా బాధించిందని, కానీ దాని వెనుక కుట్ర ఉన్నట్టు అనుమానం వస్తుందన్నారు. ఘటన జరిగిన తరవాత ఎక్సైజ్ పాలసీని తీసుకువచ్చారని ఆరోపించారు. మద్య నిషేదం చేస్తామన్నారని, బెల్టు షాపులు తీసేస్తామని చెప్పారని ఒక్క బెల్టుషాపు కూడా తీసివేయలేదన్నారు. ఇప్పుడు టెట్రా ప్యాకులు కూడా తెచ్చే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. కొత్త కొత్త బ్రాండ్లు కూడా తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు.






