- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కారు నాటకం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కారు నాటకం అని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. కేటీఆర్‌కు సిట్ నోటీసులు కాంగ్రెస్ సర్కారు నాటకం అని అన్నారు. పాలన గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలే ఇవి అని అన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు తండ్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల కర్మానికి వదిలేసి దావోస్ అటు నుండి అమెరికా పర్యటన పెట్టుకున్నారని విమర్శించారు. సర్కారు సొమ్ముతో రేవంత్ జల్సాలు చేస్తున్నారని అన్నారు. యూరియా కొరతతో రైతులు తండ్లాడుతుంటే కనీసం సమీక్షించే నాథుడు లేడన్నారు. సంక్రాంతి పోయి వారం దాటినా రైతుభరోసా ఎప్పుడిస్తారో చెప్పడం లేదన్నారు. దాని ఊస కూడా ఎత్తడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్ నడిపిస్తుందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుండి వచ్చే వరకు ఈ సీరియల్ నడిచేలా ప్లాన్ చేసినట్లు అనిపిస్తోందన్నారు. రేవంత్ సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడుతుండం విచారకరం అని వ్యాఖ్యానించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖల వెన్ను విరిచారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా మారిందన్నారు. రెండేళ్లుగా దర్యాప్తు బృందం కొండనుతవ్వి ఎలుకను కూడా పట్టలేదని అన్నారు. అధికారులు మారుతున్నారు కానీ ఆధారాలు చూపించడం లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతకుముందే చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు హామీలు అమలు చేయకుండా, అమలుకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలను అక్రమ కేసులు, నోటీసులతో వేధించడంపై సమయం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.






