- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ప్రభుత్వం వచ్చాక బెండు తీస్తాం.. ఎమ్మెల్యేకు కేటీఆర్ వార్నింగ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్‌లో చేరినట్టు చెబుతున్నారని ఎవరి డెవలప్మెంట్ కోసం వెళ్లాడని ప్రశ్నించారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్‌లో చేరినట్టు చెబుతున్నారని ఎవరి డెవలప్మెంట్ కోసం వెళ్లాడని ప్రశ్నించారు. మరో రెండేళ్లలో తమ ప్రభుత్వం వస్తుందని అప్పుడు అన్నీ బయటకు వస్తాయని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంగతి తెలుసు, ఫహీ సంగతి తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.
అందరి జాతకాలు తెలుసని సుల్తాన్ పూర్ బయటకు వస్తుంది, ఘన్సిమియా గూడ బయటకు వస్తుందని అన్నారు. ఎవరెవరిని ఏం చేయాలో ఎవరెవరి సంగతి ఎలా చెప్పాలో.. ఎవరెవరి బెండు ఎలా తీయాలో అన్నీ తెలుసని హెచ్చరించారు. ఒకసారి అడ్డమారి గుడ్డిదెబ్బకు గెలిస్తే ఇంతలా ఎగిరితేె ఎలా అని ప్రశ్నించారు. మరోసారి కేసీఆర్ తెలంగాణకు సీఎం అవుతాడని, పాలన పట్టాలెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు.






