- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Koppula Eshwar: దళితుల విషయంలో KCR ఆలోచన అదే
అట్టడుగు వర్గాలకు సరైన మార్గం చూపాలన్నదే కేసీఆర్(KCR) ఆలోచన విధానమని, దళితుల్లో పేదరికాన్ని పారద్రోలడానికి కేసీఆర్ ఆనాడు సంకల్పించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) కొనియాడారు.

దిశ, వెబ్‌డెస్క్: అట్టడుగు వర్గాలకు సరైన మార్గం చూపాలన్నదే కేసీఆర్(KCR) ఆలోచన విధానమని, దళితుల్లో పేదరికాన్ని పారద్రోలడానికి కేసీఆర్ ఆనాడు సంకల్పించారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) కొనియాడారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ 10 లక్షల ఇవ్వాలన్న విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని, అంత ధైర్యంగా నిర్ణయం తీసుకున్న సాహసోపేత నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. దళితుల కోసం రూ 57 వేల కోట్లు ఖర్చు చేయాలని కేసీఆర్ భావించారని, కేసీఆర్ ఆలోచన అమలైతే దళిత కుటుంబాల్లో దరిద్రం ఉంటుందా ? అని అడిగారు. దళిత బంధు(Dalit Bandhu Scheme)ను అమలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ(Congress Party) దళితులను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. దళిత బంధు సాధన సమితి ఉద్యమానికి అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాలని ఎమ్మెల్సీ కవితకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ , చిటిమల్ల సమ్మయ్య, మడికొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.a






