- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ సంసారం నువ్వు చేసుకో.. ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెబుతున్నారని ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు గుర్తుకు వచ్చిందన్నారు.

దిశ, వెబ్ డెస్క్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెబుతున్నారని ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు గుర్తుకు వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు చట్టసభలకు ఎన్నికైనప్పుడు మన విధులు నిర్వహించాలన్నారు. నీ సంసారం నువ్వు చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చు పెతున్నావంటూ మండిపడ్డారు. స్పీకర్ తీర్పు వచ్చిన తరవాత అయినా నీ సంసారం నువ్వు చూసుకోవాలని అన్నారు.
కాంట్రాక్టులు, అభివృద్ధి అంటే పక్కింటోడికి కన్నం వేయడం కాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 20 నెలలు ప్రయాణం చేశారని.. చేసిన ఒక్క అభివృద్ధి ఏంటో చెప్పు అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే సీఎంతో ప్రయాణం చేస్తున్నట్టు చెబుతున్నాడని ఏం చేశాడో ఒక్కటైనా చెప్పాలన్నారు. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన ఓ సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని అన్నారు. ఆధారాలు లేకుండానే మీడియా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు.






