- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ బరిలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి.. స్పీచ్ వైరల్
స్థానిక ఎన్నికల్లో ఓ వైపు యువత జోరుగా నామినేషన్లు వేస్తుంటే మరోవైపు వృద్ధులు సైతం బరిలోకి దిగుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: స్థానిక ఎన్నికల్లో ఓ వైపు యువత జోరుగా నామినేషన్లు వేస్తుంటే మరోవైపు వృద్ధులు సైతం బరిలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల వృద్ధులు నామినేషన్లు వేశారు. కాగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి సైతం సర్పంచ్ ఎన్నికలో బరిలో దిగుతున్నారు. జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి నాగారం పంచాయితీకి నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాకుండా 95ఏళ్ల వయసులోనూ ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఓటర్లను కలిసి వారితో సరదాగా ముచ్చటిస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నారు.
తన శేష జీవితాన్ని గ్రామాభివృద్ధికి అంకితం చేయాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. గ్రామానికి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులను చేస్తానని హామీ ఇచ్చారు. నాగారం గ్రామాన్ని 95ఏళ్లుగా చూస్తున్నానని చెప్పారు. రామచంద్రారెడ్డి ప్రచారంలో ఆయన కుమారుడు జగదీష్ రెడ్డి సైతం పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే రామచంద్రారెడ్డి ప్రచారంలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో యువతకు అవకాశం ఇవ్వొచ్చు కదా అనే విమర్శలు కూడా వస్తున్నాయి.






