- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ప్రాజెక్టులపై ఉత్తమ్ కట్టుకథలు.. రేవంత్ పిట్టకథలు: హరీష్ రావు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. "నదీజలాలు కాంగ్రెస్ ద్రోహాలు" పేరుతో ఇచ్చిన ఈ PPTలో పదేళ్ల బీఆర్ఎస్ పాలన సాగునీటి స్వర్ణయుగంగా సాగగా.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారికంగా ఒప్పందం చేసుకున్నారని దుయ్యబట్టారు. మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని యద్దేవా చేశారు. నీటి పంపకాల్లో ఉత్తమ్ కట్టుకథలు చెప్తే.. రేవంత్ పిట్టకథలు చెప్పారన్నారు. తాము కేవలం రాజకీయాల కోసం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం లేదన్నది అందరూ గ్రహించాలని హరీష్ రావు కోరారు. కాంగ్రెస్ కంటే తాము ఏడు రెట్లు అధిక ఆయకట్టును రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు.
కాళేశ్వరంపై కక్ష కట్టిండ్రు.. పాలమూరుపై పగబట్టిండ్రు
తెలంగాణకు సాగునీటిని అందించేందుకు అపర భగీరథుడిలా కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులను.. నేడు కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంపై కక్ష కట్టిండ్రు.. పాలమూరుపై పగబట్టిండ్రు అని విమర్శలు గుప్పించారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా.. ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని వాపోయారు. పాలమూరుకు మరణశాసనం రాసింది, విభజన సమయంలో నీటి వాటాల్లో అన్యాయం చేసింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. నాటి జలద్రోహాల కొనసాగింపుగానే నేటి రేవంత్ సర్కార్ విధానాలు, వ్యవహారాలు ఉన్నాయన్నారు. తెలంగాణ సాధించిన నీటి హక్కుల్ని తాకట్టు పెట్టి.. రాష్ట్ర భవిష్యత్తును మంటగలుపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పెద్దల మెప్పుకోసం, పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను చేజేతులా నాశనం చేస్తున్నారన్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుని.. కేసీఆర్, రిటైర్డ్ సీడబ్ల్యూసీ విద్యాసాగర్ కలిసి శ్రీశైలం సోర్సుగా కట్టాలని భావించారని తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి 50 టీఎంసీల నీరు వస్తుందని ఆశించగా.. రెండేళ్లగా ఆ ఆశలను కూడా రేవంత్ కాలరాశారని విమర్శించారు.
మోకాలు - బోడిగుండుకు ముడిపెట్టేలా సీఎం వ్యాఖ్యలు
రూ.200 కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరం కింద 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని, కానీ రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కక్షగట్టారని హరీష్ రావు దుయ్యబట్టారు. ఇక ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లోనే తాము కొత్త ట్రిబ్యునల్ పై ప్రశ్నించామన్నారు. పాలమూరు, డిండిలను కొనసాగిస్తామని కేసీఆర్ ఆనాడే చెప్పారని, టెలీమెట్రీలను పెట్టాలని కూడా 2016లోనే పెట్టాలని చెప్పారన్నారు. కానీ రేవంత్ అవన్నీ దాచి సగం పేరాగ్రాఫ్ లే చదివారని పేర్కొన్నారు. సీఎం మాటలు మోకాలు - బోడిగుండుకు ముడిపెట్టేలా ఉన్నాయని.. అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని హరీష్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి, జగన్ సమక్షంలోనే పోతిరెడ్డిపాడును కేసీఆర్ వ్యతిరేకించారు. పోతిరెడ్డిపాడును ఆపకపోతే అలంపూర్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తానని కేసీఆర్ హెచ్చరించారు. ప్రాజెక్టులు అప్పగించబోమని కేసీఆర్ చెప్పిన విషయాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా చదవలేదన్నారు. నీళ్ల పంపిణీకి కేసీఆర్ ఒప్పుకున్నట్లు అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు.






