గోపినాథ్​ ఆశయాల కోసం సునీతమ్మను గెలిపించాలి: హరీష్​రావు

by Ajay Maddhiboyina |

దివంగత గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని నియోజకవర్గం ప్రజలంతా ఆమెను గెలిపించాలని మాజీ మంత్రి హరీష్​రావు కోరారు.

గోపినాథ్​ ఆశయాల కోసం సునీతమ్మను గెలిపించాలి: హరీష్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత గోపీనాథ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు వారి సతీమణికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని నియోజకవర్గం ప్రజలంతా ఆమెను గెలిపించాలని మాజీ మంత్రి హరీష్​రావు కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్​పేటలోని అంబేద్కర్​నగర్ లో జరిగిన కార్నర్​మీటింగ్​లో మాట్లాడుతూ సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని, గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఎదురీతకు లేడీ నిలుచుంటే అటు దిక్కు రౌడీ నిలుచున్నాడని లేడీనా, రౌడీనా గెలవాలో మీరే నిర్ణయించాలన్నారు. కష్టాల్లో బస్తీ సమస్యలను పరిష్కరించేందుకు ఏ ఆపదా ఉన్న, ఏ పని పడ్డా సునీతమ్మ ఒకటే కాదు మేమందరం ఆమె కోసం అండగా ఉంటాం. మీకు సేవ చేస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రోడ్ షోలకు జూబ్లీహిల్స్ ప్రజలు రావడంలేదని కొడంగల్ నుంచి జనాలను తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారని, అవి రావాలంటే బీఆర్​ఎస్​ను గెలిచించాలని కోరారు. ఇక్కడ ప్రజలకు కాంగ్రెస్​కు కర్రు కాల్చి వాత పెట్టాలని, కేసీఆర్ మాట మనిషి. రూ. 200 పెన్షన్​రూ. 2వేలకు చేసిన ఘనత ఆయనదేనన్నారు. నోటీస్ ఇచ్చాక కూడా కాంగ్రెస్ కు ఓటేస్తే ఇల్లు కూలగొట్టడానికి అనుమతిచ్చారు అని రేవంత్​రెడ్డి అనుకుంటాడని పేర్కొన్నారు. ఇల్లు కూలగొడతాం అన్నాక కూడా ఎవరైనా ఓటు వేయరని, ఈపాలకులు హైదరాబాదులో ఇల్లులు కూల్చడం తప్ప ఒక్కరికి ఇల్లు నిర్మించలేదన్నారు.

కేసీఆర్ లక్ష ఇండ్లు కడితే రేవంత్ రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టాడు. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే మహబూబ్​నగర్​లోని అవ్వకు రూ. 4 వేల పెన్షన్ వస్తుందన్నారు. ముఖ్యమంత్రి మాటలకు మీరంతా చేతలతో సమాధానం చెప్పాలని కోరారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, బోగస్​ఓట్లతోని, దొంగోట్లకు గెలవాలని చూస్తున్నారు. కారు గుర్తుకు ఓటెయ్యాలనుకునే వాళ్ళు పొద్దున్నే 6 గంటలకు లైన్లో నిల్చోని కారు గుర్తు మీద కీ అని నొక్కాలి సూచించారు. రోడ్ రోలర్ కు, చపాతీ మేకర్ కు ఓట్లు పోతాయని ముఖ్యమంత్రికి దింపుడు కళ్ల ఆశ ఉందని ఎద్దేవా చేశారు. ముస్లింలు కాంగ్రెస్ లేకపోతే లేరు అని అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్ కంటే ముందు ముస్లింలు ఉన్నారు. కాంగ్రెస్ ఖతమైన తర్వాత కూడా ముస్లింలు ఉంటారు. రేవంత్ రెడ్డికి ముస్లిం సోదరులు ఓటుతో సమాధానం చెప్పాలని సూచించారు.

Next Story