- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ విచారణకు హరీష్‌రావు.. జూబ్లీ పీఎస్ వద్ద భారీ బందోబస్త్
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు, తన న్యాయవాదులతో కలిసి ఉదయం 11 గంటలకు హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతలు, తన న్యాయవాదులతో కలిసి ఉదయం 11 గంటలకు హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. హరీష్ రావు విచారణ నేపథ్యంలో పీఎస్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. భారీఎత్తున బీఆర్ఎస్ నేతలు రావడంతో పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. హరీష్ రావు న్యాయవాదులను కూడా పీఎస్ లోపలికి అనుమతించలేదు. విచారణకు హరీష్ రావు ఒక్కడినే అనుమతించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిన్న హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నేడు ఆయన్ను ఆరుగురు అధికారుల బృందం కీలక అంశాలపై విచారణ చేయనుంది. జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి, డీసీపీ రీతిరాజ్ లతో పాటు మరో ముగ్గురు సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు.
ఎన్నిగంటలు విచారించినా ఏం ఉపయోగం లేదు
పోలీస్ స్టేషన్లోకి హరీష్ వెంట ఆయన అడ్వొకేట్ ను పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అడ్వొకేట్.. సిట్ నోటీసులు ఇచ్చిన కేసుతో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్ని గంటలు విచారించిన కొత్తగా ఏమీ తేలేది లేదన్నారు. ఇప్పటికే హైకోర్టు ఈ కేసును ఫాల్స్ కేసుగా తేల్చేసిందని గుర్తుచేశారు.
సిట్ విచారణకు హాజరయ్యే ముందు హరీష్ రావు తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలతో పరువు పోతోందనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కుంభకోణాలను బయటికి తీస్తున్నందుకే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.






