- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అన్ని ప్రాంతాలకు నన్నే రమ్మంటున్నారు.. మాజీమంత్రి ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం మనదేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే తాను గ్రామాల్లో తిరుగుతున్నానని అన్నారు. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు తననే రమ్మంటున్నారని చెప్పారు. వర్ధన్నపేటకు రమ్మంటున్నారని, వరంగల్ కు రమ్మంటున్నారని అన్నారు. కానీ తాను పాలకుర్తిలోనే మళ్లీ నిలబడతానని వాళ్ల సంగతి ఏంటో చూస్తానని చెప్పారు. దయచేసి కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. నాయకులు విజృంభించాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు.
ఇప్పటి నుండి చాలా బిజీ పనులు ఉంటాయని పార్టీ సభ్యత్వాలు, మండల కమిటీల ఎంపిక, గ్రామ కమిటీల ఎంపికలు ఉంటాయని చెప్పారు. ఇవన్నీ పెద్దఎత్తున ఉంటాయన్నారు. తాను ఎవరికీ టార్గెట్ లు ఇవ్వనని నాయకులే టార్గెట్ పెట్టుకుని పనిచేయాలన్నారు. ఎంత మందిని తీసుకురావాలో కూడా తాను చెప్పనని గ్రామాల్లో మీ అనుకూలతను బట్టి జనాలను తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. ఇదిలా ఉంటే పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే తాను రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటానని సైతం ఎర్రబెల్లి సవాల్ చేశారు.