- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు వేసేందుకు మాజీ జవాన్ 148కి.మీ సైకిల్ యాత్ర
రాష్ట్రంలోని పలు పంచాయితీలకు నేడు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా మిగితా ప్రాంతాల్లో ప్రశాంతంగా సాగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని పలు పంచాయితీలకు నేడు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా అక్కడక్కడా చిన్నచిన్న ఘటనలు మినహా మిగితా ప్రాంతాల్లో ప్రశాంతంగా సాగుతోంది. ఇక ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న స్థానిక ఓటర్లు సొంతగ్రామాలకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మాజీ ఆర్మీ జవాన్ సైకిల్ పై 148కి.మీ ప్రయాణించి స్వగ్రామంలో ఓటు వేశాడు.
హైదరాబాద్ లో ఉంటున్న మాజీ జవాన్ మల్లయ్య తన స్వగ్రామం అయిన సంగారెడ్డి జిల్లా మనూర్ కు సైకిల్ పై వెళ్లాడు. ఉదయం 4 గంటల 20 నిమిషాలకు మల్లయ్య బీహెచ్ఈఎల్ నుండి బయలుదేరగా 10గంటలకు మనూర్ చేరుకున్నాడు. ఓటు వేసిన అనంతరం తన స్నేహితులను కలిసి సరదాగా ముచ్చటించి అక్కడ నుండి తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు. 148 కి.మీ సైకిల్ పై వచ్చి ఓటు వేయడంతో గ్రామస్తులు అశ్చర్యపోయారు. తన సైకియ్ యాత్రతో ఫిట్నెస్, పర్యావరణ పరిరక్షణపై మల్లయ్య చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.






