పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయండి: ఆకునూరి

by Disha Web Desk 2 |
పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయండి: ఆకునూరి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ చేస్తున్న శాంతియుత నిరవధిక సమ్మెకు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మద్దతు పలికారు. వారి డిమాండ్లు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రొబేషనరీ కాలం ముగియగానే రెగ్యులర్ చేయడం సంచాయతీ కార్యదర్శుల సహజమైన హక్కు అని, అది ప్రభుత్వ బాధ్యత అని ఆకునూరి మురళి గుర్తు చేశారు. ప్రతీ సమస్యపై రోడ్ల మీదకు పోరాటం చేయాలా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలోనే దరిద్రపు పాలన ఉందన్నారు. పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులర్ చేయాలని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.

కాగా సమస్యలపై పరిష్కారం కోరుతూ ఈ నెల 28 నుంచి తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నిరవధిక సమ్మెకు దిగింది. జేపీఎస్‌లను రెగ్యులర్ చేస్తూ నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్ కాలంగా గుర్తించాలని డిమాండ్ చేసింది. ‘‘ఓపీఎస్‌లను జేపీఎస్‌లుగా రెగ్యులర్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల కేడర్ స్ట్రెంత్‌ను నిర్ధారించి ప్రకటించాలి. విధి నిర్వహణలో మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. జీవో 317 వల్ల నష్టపోయిన పంచాయతీ కార్యదర్శులకు న్యాయం చేస్తూ పరస్పర, స్పౌంజ్ బదిలీలు చేపట్టాలని.’’ తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ డిమాండ్ చేసింది.


Next Story

Most Viewed