- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర గీతానికి మాజీ ఐఏఎస్ నృత్యం!.. పాత పాటే బాగుందని చెబుతున్నారా మేడం?
తెలంగాణ రాష్ట్ర గీతానికి మాజీ ఐఏఎస్ అధికారి నృత్యం చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గీతానికి మాజీ ఐఏఎస్ అధికారి నృత్యం చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జీడీ అరుణ సౌందరరాజన్ అనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ ఏర్పాడ్డాక పలు జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. అయితే ఆమె తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం అయిన జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటకు అరుణ నృత్యం చేశారు. ఆమె తన ఇంట్లో ఆ సాంగ్ ను పెట్టుకొని వింటూ సరదాగా స్పెప్పులు వేశారు.
దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే ఆమె ఈ పాట ఓల్డ్ వర్షన్ సాంగ్ వింటూ డ్యాన్స్ చేయడం ఆసక్తిగా మరింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి ఆవిష్కరించి, జాతికి అంకితం ఇచ్చిన కొత్త పాటను కాకుండా పాత పాటకు స్టేప్పులు వేయడం చర్చనీయాంశం అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వావ్ సూపర్ మేడం అంటూ ఒకరు ప్రశంసిస్తుండగా.. మరొకరు ఈ సాంగే బాగుందని చెబుతున్నారా మేడం అని కామెంట్ పెట్టారు.gd






