- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా!
ప్రముఖ వ్యాపారవేత్త దొడ్ల దివ్యారెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు రూ. 1.20 కోట్లు దోచుకున్నారు. అకౌంటెంట్‌ను నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు (Cyber Crime) రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిలువునా దోచేస్తున్నారు. తాజాగా మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనుమరాలు దొడ్ల దివ్యారెడ్డికి (Dodla Divya Reddy) సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. రూ.1.20 కోట్ల మేర ఆమెకు కుచ్చుటోపి పెట్టారు. దివ్యారెడ్డి పేరుతో ఆమె అకౌంటెంట్‍ను ట్రాప్ చేసి భారీ మోసానిసి పాల్పడ్డారు. దివ్యారెడ్డి 18 కంపెనీలకు డైరెక్టర్‍గా ఉన్నారు. ఈ క్రమంలో తాను మీటింగ్‍లో ఉన్నానని తన ఖాతాకు రూ. 1.20కోట్లు పంపాలని దివ్యారెడ్డి మాదిరిగా అకౌంటెంట్‍కు మెసేజ్ పంపించారు. ఆ సందేశం వచ్చింది తన బాస్ నుంచే అని భావించిన సదరు అకౌంటెంట్ రూ. 1.20 కోట్లు పంపించారు.
మళ్లీ డబ్బు పంపమనడంతో..
అయితే ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ అకౌంటెంట్‍కు మళ్లీ వాట్సాప్ సందేశం రావడంతో డబ్బులు పంపేందుకు చెక్ అప్రూవల్ కోసం డైరెక్టర్‍ను అకౌంటెంట్ సంప్రదించాడు. ఈ క్రమంలో గతంలో చేసిన రూ. 1.20 కోట్ల లావాదేవి వివరాలు దివ్యారెడ్డికి వివరించాడు. అతడు చెప్పినది విని కంగుతిన్న దివ్యారెడ్డి తాను ఎలాంటి డబ్బు పంపమని క్లారిటీ ఇచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించి వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.






