- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైనార్టీ శాఖకు మైనార్టీని మంత్రిని చేయాలి: మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
మైనార్టీలకు కేసీఆర్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తే రేవంత్‌రెడ్డి ఒక్క మైనారిటీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. మైనార్టీ శాఖకు మైనార్టీని మంత్రిని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్

దిశ, తెలంగాణ బ్యూరో: మైనార్టీలకు కేసీఆర్ డిప్యూటీ సీఎం పదవి ఇస్తే రేవంత్‌రెడ్డి ఒక్క మైనారిటీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని.. మైనార్టీ శాఖకు మైనార్టీని మంత్రిని చేయాలని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని.. వాటిని రేవంత్‌రెడ్డి విస్మరించారని ఆరోపించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని.. సబ్ ప్లాన్ తెస్తామని డిక్లరేషన్‌లో చెప్పి చేయలేదన్నారు.
ఇమామ్, మౌజంలకు వేతనాలు పెంచుతామని చెప్పి పెంచలేదని పేర్కొన్నారు. ఇమాం, మౌజంలను ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఆడుగుతూ వారిపై ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. ఆదాయమే లేనప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఎలా తెస్తారని ప్రశ్నించారు. మైనారిటీ గురుకులాల్లో సరైన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్‌లను వెంటనే విడుదల చెయాలని డిమాండ్ చేశారు. వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లా ఖాన్ మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వంలో మైనారిటీలకు ఒరిగింది శూన్యమన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాలని చిత్తశుద్ధి ఆయనకు లేదన్నారు. షబ్బీర్ అలీ సీఎంకు సలహాదారుగా ఉన్నా మైనార్టీలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు.






