పార్టీ గుర్తుపై గెలిచే ఎన్నిక‌లైతే బీఆర్ఎస్ స‌త్తా తెలిసేది.. కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-21 09:54:56  IST  )

బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను తిట్ట‌డం.. అవ‌మానించ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ విధానం అన్నారు.

పార్టీ గుర్తుపై గెలిచే ఎన్నిక‌లైతే బీఆర్ఎస్ స‌త్తా తెలిసేది.. కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను తిట్ట‌డం.. అవ‌మానించ‌డ‌మే ఈ ప్ర‌భుత్వ విధానం అన్నారు. పార్టీ నేత‌ల‌ను దూషిస్తూ, పార్టీపై ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇది మాత్ర‌మే కాంగ్రెస్ ఎజెండాగా క‌నిపిస్తుంద‌ని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఒకే విధంగా ఉన్నార‌ని అన్నారు. పంచాయితీ ఎన్నిక‌ల్లో గెలిచిన అభ్య‌ర్థుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. పార్టీ గుర్తుపై జ‌రిగే ఎన్నిక‌లు అయితే బీఆర్ఎస్ పార్టీ సత్తా తెలిసేదన్నారు. ఈ ఎన్నికల ఫలితాలతో ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త తెలిసిందన్నారు.

గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జనం బుద్ధి చెప్పారన్నారు. తమ హయాంలో ఎప్పుడూ గర్వంతో వ్యవహరించలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తివిలువ పూర్తిగా తగ్గిందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై స్పీక‌ర్ తీసుకున్న నిర్ణ‌యంపై మ‌ళ్లీ న్యాయ‌స్థానాల‌కు వెళ‌తామ‌ని అన్నారు. ప్ర‌జ‌ల్లోకి వెళ‌దామని కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్ర‌మాల గురించి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వంపై ఇంత వ్య‌తిరేక‌త ఉన్నా ప్ర‌భుత్వం తీరుమార‌డం లేద‌న్నారు. ప్ర‌తిప‌క్షంగా రెండేళ్లు స‌మ‌యం ఇచ్చామ‌ని ప్ర‌జ‌ల ప‌క్షాన గ‌ట్టిగా కొట్లాడాల్సిన స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని అన్నారు. స‌మావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కీల‌క నేత‌లు పాల్గొన్నారు.

Next Story