- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలాపూర్ లడ్డూ వేలానికి సర్వం సిద్ధం.. ఆ ఏడుగురు కూడా రెడీ..
by Gantepaka Srikanth |
బాలాపూర్ లడ్డూ వేలం(Balapur Laddu Auction) పాటకు సర్వం సిద్ధం అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలాపూర్ లడ్డూ వేలం(Balapur Laddu Auction) పాటకు సర్వం సిద్ధం అయింది. కాసేపటికి క్రితమే చివరి పూజ పూర్తి కాగా, ప్రస్తుతం ఊరేగింపు కొనసాగుతోంది. బొడ్రాయి దగ్గర వేలం పాట జరుగనుంది. ఈసారి వేలం పాటలో ఏడుగురు పాల్గొననున్నట్లు సమాచారం. కాగా, 1994వ సంవత్సరం నుంచి ఈ బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. అప్పుడు 450 రూపాయలతో మొదలయ్యి గతేడాది 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు పలికింది. ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తున్న బాలాపూర్ లడ్డూ వేలం పాట ఈసారి ఎంతవరకు వెళ్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బాలాపూర్ లడ్డూ వేలంపాటకు పోలీసు, యంత్రాంగం కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గత సంవత్సరం రూ.30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు కొలన్ శంకర్ రెడ్డి దక్కించుకున్నారు.
Next Story






