మెస్సీ రాకకు సర్వం సిద్ధం.. ఉప్పల్ స్టేడియంకి చేరుకున్న గోట్ టూర్ ప్రమోటర్ల బృందం

by Ramesh Naini |

అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే.

మెస్సీ రాకకు సర్వం సిద్ధం.. ఉప్పల్ స్టేడియంకి చేరుకున్న గోట్ టూర్ ప్రమోటర్ల బృందం
X

దిశ, డైనమిక్ బ్యూరో : అర్జెంటీనా లెజెండరీ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 13న మెస్సీ రాకకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ (మంగళవారం) ఉప్పల్ స్టేడియంకి మెస్సీ గోట్ టూర్ -2025 ప్రమోటర్ల బృందం చేరుకుంది. GOAT టూర్ ఇండియా చీఫ్ పార్వతి రెడ్డి, చీఫ్ ప్రమోటర్ దత్తా, మెస్సీ అంతర్జాతీయ టూర్ సలహాదారు, వ్యక్తిగత మేనేజర్ క్రిస్టోఫర్ ఫ్లాన్నరీ, పాబ్లో నెగ్రేతో పాటు తదితరులు స్టేడయానికి వచ్చారు. సమన్వయ కమిటీలో భాగమైన రోహిన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెస్సీ ధరించే జెర్సీలను ఆవిష్కరించారు.

గోట్ టూర్ -2025 లో భాగంగా మెస్సీ భారత్‌లో అడుగుపెట్టనున్నారు. అందులో భాగంగా ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ షో నిర్వహిస్తారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ ప్రాక్టీస్ సైతం చేశారు. ఆర్‌ఆర్ 9 జెర్సీతో సీఎం బరిలోకి దిగనున్నారు. ఫుట్‌బాల్ అంటే సీఎంకు ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.

మెస్సీ పర్యటన షెడ్యూల్ ఇదే..

డిసెంబర్ 13 కోల్‌కతా- ఉదయం 10:30 గంటలకు కోల్‌కతాలో సాల్ట్ లేక్ స్టేడియం

డిసెంబర్ 13 హైదరాబాద్- సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌కు

డిసెంబర్ 14 ముంబై- సాయంత్రం 5:30 గంటలకు ముంబైలో వాంఖడే స్టేడియం

డిసెంబర్ 15 ఢిల్లీ- పర్యటన చివరి రోజు మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియం

Next Story