ప్రతి కాంగ్రెస్ లీడర్ క్షమాపణ చెప్పాల్సిందే.. జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్

by Kema Shiva Kumar |

కాంగ్రెస్ నేతలు తమకు లక్ష సార్లు క్షమాపణలు చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ప్రతి కాంగ్రెస్ లీడర్ క్షమాపణ చెప్పాల్సిందే.. జాతీయ మీడియాతో పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో తనను, తన పార్టీని విమర్శించిన కాంగ్రెస్ నాయకులే తమకు లక్ష సార్లు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డిమాండ్ చేవారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అనంతరం జాతీయ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ నాయకులు ఏవైతే మాట్లాడారో, వాటిని మాత్రమే తాను ప్రస్తావించానని తెలిపారు. అంతకు మించి ఏమీ లేదని.. అవి తన వ్యక్తిగత విమర్శలు కావని పవన్ క్లారిటీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ నేతలు తమపై చేసిన లెక్కలేనన్ని విమర్శలు, బూతులను గుర్తుచేస్తూ మండిపడ్డారు. తమపై లెక్కలేనన్ని వ్యాఖ్యలు, తిట్లతో పోలిస్తే.. ఆయా కాంగ్రెస్ (Congress) నాయకులే తమకు క్షమాపణలు చెప్పాలి. మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ ఖచ్చితంగా సారీ చెప్పి తీరాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

Next Story