మావోయిజం అంతం అయినా పోరాటాలు ఆగవు: ప్రొ.హరగోపాల్

by Prasad Jukanti |   (  Updated:2026-03-16 11:07:53  IST  )

ఆదివాసీలకు కష్టం వస్తే పోరాటం ఏ రూపంలో వస్తుందో చెప్పలేమని హరగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మావోయిజం అంతం అయినా పోరాటాలు ఆగవు: ప్రొ.హరగోపాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిజం (Maoism) అంతం అయినా పోరాటాలు ఆగవని ప్రొఫెసర్ హరగోపాల్ (Professor Haragopal) అన్నారు. ఉద్యమాల్లో బలహీనతలు, టెక్నాలజీ ఆపరేషన్ కగార్‍కు (Operation Kagar) ఉపయోగపడయ్యాని చెప్పారు. ఇదివరకు పట్టుబడిన వారు ఇచ్చిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతల మూలాలను గుర్తించారని అందులో భాగంగా పార్టీ జనరల్ సెక్రటరీ నంబాళ్ల కేశవరావును చంపేశారన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్ తో మాట్లాడిన ఆయన.. మావోయిజం లేనప్పుడు అర్బన్ నక్సలిజం ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ దేశంలో లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సల్ అన్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారందరినీ అర్బన్ నక్సల్స్ గా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రూపంలో మావోయిజం కొనసాగడం సాధ్యం కాదన్నారు. కానీ భవిష్యత్‍లో ఆదివాసీల సంపదను, ఖనిజాలను మైనింగ్ చేయడం మొదలు పెడితే ఆదివాసీలు నిర్వాసితులుగా మారినప్పుడు పోరాట రూపాలు ఎలా మారుతాయో మనకు తెలియదన్నారు.

Next Story