పదేళ్లయినా రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-02 06:25:52  IST  )

పదేళ్లయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పదేళ్లయినా రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలే.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌‌డెస్క్: పదేళ్లయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన సీఎం అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని కామెంట్ చేశారు. దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తాము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రాన్ని పునర్నిర్మంచే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయగా పని చేస్తున్నాం..

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది తమ లక్ష్యమని అన్నారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని.. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితం ప్రయాణించే అవకాశం కల్పించామని తెలిపారు. రానున్న రోజుల్లో క్యూఆర్‌ కోడ్‌ కార్డు ఇచ్చి మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించే పథకాన్ని తీసుకొస్తామని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. అన్నదాతలకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామి అన్నారు. వారికి ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఆత్మీమ భరోసా ద్వారా రూ.12 వేలు సాయం చేస్తున్నామని గుర్తు చేశారు. మరోవైపు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఇవాళ రూ.2.75 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందని తెలిపారు. అదేవిధంగా ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని సీఎం అన్నారు.

అన్నదాతలకు భూ సమస్యలు లేకుండా చేస్తున్నాం..

దేశానికి అన్నం పట్టే రైతన్నకు భూ సమస్యలు లేకుండా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి. అందుకే తాము భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టమైందని ఆయన అభివర్ణించారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సలు నిర్వహిస్తున్నామని అన్నారు. అధికారులు నేరుగా అన్నదాతల ఇళ్లకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరించే వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు.

ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామకాలు..

దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని అన్నారు. ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పెట్టుబడుల ద్వారా లక్ష మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించామని అన్నారు. ఉద్యగా భర్తీలో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరగొన్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో కోట్లలో యువత ఉన్న ఒలింపిక్స్‌లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం బాధకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story