రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి.. మండలి చైర్మన్ గుత్తా హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Government) చేపట్టిన సమగ్ర సర్వే (Comprehensive Survey)పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి.. మండలి చైర్మన్ గుత్తా హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ (Congress Government) చేపట్టిన సమగ్ర సర్వే (Comprehensive Survey)పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) జారీపై తాను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి లేఖ రాశానని తెలిపారు. దారిద్య్ర రేఖకు దిగువన (Below Poverty Line), దారిద్య్ర రేఖకు ఎగువన (Above Poverty Line) విధానాన్ని అనుసరించి కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేయాలని సూచించానని పేర్కొన్నారు. అలా చేస్తే.. ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరుగుతుందని లేఖలో సీఎం రేవంత్‌ సమగ్రంగా వివరించనట్లుగా తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ (BRS Party) గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరడాన్ని ఏలా చూస్తారని ప్రశ్నించగా.. ఆయన సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఆ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) పరిధిలో ఉందని అన్నారు. ఆ విషయంపై ఈ సందర్భంలో మాట్లాడటం కరెక్ట్ కాదని దాట వేశారు. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చాక ఏ నాయకుడైనా నైతిక విలువలు పాటించాలని, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని కామెంట్ చేశారు. అదేవిధంగా మదర్ డెయిరీ (Mother Dairy) ఆస్తుల అమ్మకంతో సమస్య పరిష్కారం కాదని అన్నారు. డెయిరీ అప్పులపై రాష్ట్ర ప్రభుత్వమే (State Government) తుది నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Next Story