కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. ఈటల రాజేందర్ కీలక ప్రకటన

by velandi.Saikiran |   (  Updated:2025-05-21 21:37:22  IST  )

కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ కావడంపై.. బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు కాళేశ్వరం

కాళేశ్వరం కమిషన్ నోటీసులు.. ఈటల రాజేందర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడంపై.. బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ నుండి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని మరోసారి పేర్కొన్నారు. తన చేతికి నోటీసులు వస్తే చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతానని చెప్పారు. కమిషన్ వేసింది కాళేశ్వరం అవినీతిపైనా లేకపోతే లోపాలపైనా ? అని వెల్లడించారు.

విచారణకు 6 నుంచి 7 సార్లు గడువు పెంచారని.. అధికారులు కమిషన్ కు అన్ని విషయాలు చెప్పారన్నారు. ప్రాజెక్టు నిర్మాణం అంతా ఆర్థిక శాఖతో ఉండదు... కమిషన్ దగ్గర సమాచారమంతా ఉన్నాక మేము వచ్చి ఏం చేస్తాం? అని ప్రశ్నించారు బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్. కాళేశ్వరం బ్యారేజీలపై తప్పకుండా లోతైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కారకులైన వారికి తప్పకుండా శిక్ష పడాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్.

Next Story