Etela Rajender: జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించండి.. కేంద్రమంత్రికి ఈటల రిక్వెస్ట్

by Gantepaka Srikanth |

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnav)తో బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) భేటీ అయ్యారు.

Etela Rajender: జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించండి.. కేంద్రమంత్రికి ఈటల రిక్వెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini Vaishnav)తో బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు వినతిపత్రాలను అందజేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పలు RUB, ROB పనుల కోసం విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను పూర్తి చేయాలని కోరారు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్ళను నిలుపుదల చేయాలని కూడా కోరారు. కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు.

Next Story