- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవన్నీ మంత్రి శ్రీధర్‌బాబుకు వివరించా: MP ఈటల
తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై మంత్రి శ్రీధర్‌బాబు కలిసినట్లు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తన పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై మంత్రి శ్రీధర్‌బాబు కలిసినట్లు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌తెలిపారు. మల్కాజిగిరిలో తాగునీటి ఇబ్బంది, రోడ్లు, డబుల్ బెడ్ రూంలు ఇళ్లు పేదలకు కేటాయించాలని కోరారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు. చెరువులు మురికి కూపాలుగా మారాయని వీటిని దృష్టి పెట్టి బాగు చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పినట్లు, హైడ్రా వచ్చాక చాలామంది బెదిరింపులకు పాల్పడుతూ పేదల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అటువంటి వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరినట్లు చెప్పారు. చిన్న చిన్న దేవాలయాలు కూడా దేవాదాయ శాఖ కిందకి తీసుకొచ్చారని దీంతో ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
డంప్ యార్డులు కూడా ఇబ్బంది పెడుతున్నాయని, నగరానికి నాలుగు వైపులా డంప్ యార్డులు పెట్టాలి కానీ చెత్త అంతా బాలాజీ నగర్ పంపిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో కాంట్రాక్ట్ పనులు చేసినవారికి వెంటనే బిల్లులు చెల్లించాలని లేకుంటే వారు పనులు చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. తాను కూడా మంత్రిగా పనిచేశానని, విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసునని, మంత్రిగా సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత వారి మీద ఉందన్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని కోరడంతో సానుకూలంగా స్పందించారని తెలిపారు.






