Owaisi: ఇప్పుడెక్కడి నుంచి వచ్చారు?.. ఎర్రకోట బ్లాస్ట్ పై అమిత్ షాకు ఒవైసీ ప్రశ్న

by Prasad Jukanti |   (  Updated:2025-11-19 06:52:41  IST  )

ఆత్మాహుతిని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ డాక్టర్ నబీ చేసిన వీడియోను ఒవైసీ ఖండించారు.

Owaisi: ఇప్పుడెక్కడి నుంచి వచ్చారు?.. ఎర్రకోట బ్లాస్ట్ పై అమిత్ షాకు ఒవైసీ ప్రశ్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశరాజధాని ఎర్రకోట వద్ద పేలుడు (Red Fort Blast) ఘటన, ఉగ్రవాద మాడ్యుల్ విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‍షా పై (Amit Shah) హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Owaisi) విమర్శలు గుప్పించారు. గత ఆరు నెలల్లో స్థానిక కశ్మీరీలలో ఎవరూ ఉగ్రవాద గ్రూపులలో చేరలేదని ఆపరేషన్ సిందూర్, మహదేవ్ సమయంలో అమిత్ షా పార్లమెంట్‍కు చెప్పారని మరి ఇప్పుడు ఢిల్లీ పేలుడులో పాల్గొన్న ఈ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈ గ్రూప్‍ను గుర్తించడంలో వైఫల్యానికి ఎవరు బాధ్యత వహిస్తాని నిలదీసారు. ఈ మేరకు తాజాగా ఎక్స్ లో పోస్టు చేసిన ఒవైసీ.. ఎర్రకోట వద్ద ఆత్మహుతికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ వీడియోపై కూడా స్పందించారు.

ఇస్లాంలో ఆత్మహుతిని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆత్మాహుతి అంటే బలిదానం అని అమరత్వం పొందేందుదు ఇది సరైన పనే అంటూ నబీ రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోపై స్పందించిన ఒవైసీ నబీ వ్యాఖ్యలను ఖండించారు. డాక్టర్ ఉమర్ నబీ చర్యలు ముమ్మాటికే ఉగ్రవాదమేనన్నారు. అతని చర్యలలు ఉగ్రవాదం తప్ప మరేమి కాదన్నారు. ఇస్లాంలో ఆత్మహత్య, అమాయకులను చంపండం ఘోరమైన పాపం అన్నారు. ఇటివంటి చర్యలు దేశ చట్టానికి కూడా విరుద్ధం అన్నారు. వాటిని ఏ విధంగాను తప్పుగా అర్థం చేసుకోబడలేదని నబి వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు.

Read More... హైదరాబాద్ ఉగ్రవాదిపై సబర్మతి జైలులో దాడి

Next Story