తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు కొత్త బాస్

by Gantepaka Srikanth |

తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.

తెలంగాణ మహిళా కాంగ్రెస్‌కు కొత్త బాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్రబెల్లి స్వర్ణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతగా అనేక పదవులను నిర్వహించారు. గతంలో ఆమె 2005 నుంచి 2010 వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశారు. పీసీసీలో సుదీర్ఘకాలం అనేక పదవుల్లో ఎర్రబెల్లి స్వర్ణ కొనసాగారు. నన్నపనేని రాజకుమారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి స్వర్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

2014లో ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భారత్ జోడో యాత్ర, 2022లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాదయాత్ర, 2022 మరియు 2023లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు. 2025లో టీపీసీసీ కార్యదర్శిగా, 2023 నుంచి 2025 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె బాద్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో 1985 నుంచి ఎర్రబెల్లి స్వర్ణ పార్టీ పట్ల నిబద్ధతతో కొనసాగుతున్నారు. దీనితో ఆమెకు కీలకమైన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలి పదవిని ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఎర్రబెల్లి స్వర్ణ నియామకం పట్ల కాంగ్రెస్ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story