- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జులై మొదటివారంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్!
విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎప్ సెట్ కౌన్సెలింగ్ జులై మొదటి వారంలో ప్రారంభం కానుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎప్ సెట్ కౌన్సెలింగ్ జులై మొదటి వారంలో ప్రారంభం కానుంది. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి స్పష్టత ఇచ్చింది. అయితే కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలలో జాప్యానికి పలు కారణాలున్నాయని పేర్కొంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఎప్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తొంది. కౌన్సెలింగ్ కు షెడ్యూల్ విడుదలకు ముందే కొన్ని విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉందని భావించిన ఉన్నత విద్యా మండలి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తోందది.
ఇటీవల ఫీజుల పెంపులేదని టీఏఎఫ్‌ఆర్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఇంజనీరింగ్ కాలేజీల నుంచి లీగల్ సమస్యలు ఉంటాయని భావిస్తోంది.
రాష్ట్రంలో బీటెక్ సహా ప్రోఫెషనల్ కోర్సుల కన్వినర్ కోటా ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ ఫీజు రెగ్యులేటరీ కమిటి(టీఏఎఫ్ఆర్సీ) ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. ఆ కమిటీ కాలేజీల వారీగా ఫీజులను ఖరారు చేసింది. ఆ ఫీజులను ఆమోదించాల్సిన తరుణంలో ప్రభుత్వం వివిధ కాలేజీల్లో ఫీజులు అసాధారణంగా పెరగడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇటీవలే జరిగిన టీఏఎఫ్ఆర్సీ సమావేశంలో ఫీజుల పెంపు లేదని, పాత ఫీజులతోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులు ఎప్ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను సిద్దం చేసిన సంగతి తెలిసిందే.






