- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంజనీరింగ్ బీ- కేటగిరీ సీట్ల కేటాయింపు
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి గురువారం అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో బీ-కేటగిరీ ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి గురువారం అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశ ప్రక్రియను చేపడుతున్నట్లు మండలి తెలిపింది. పూర్తి వివరాలను టీజీ సీహెచ్ఈ వెబ్‌సైట్ www.tgche.ac.in లో అందుబాటులో ఉంచారు.
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటీఈ) మార్గదర్శకాలకు అనుగుణంగా, జాతీయ, రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ విధానాలను అనుసరించి ఈ బీ-కేటగిరీ ప్రవేశాలు జరుగుతాయని ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. టీజీఈఏపీ సెట్ 2025, జోసా, సీసాబ్ ప్రత్యేక రౌండ్లతో సహా కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 19 నుండి ఆగస్టు 10 వరకు జరగనుంది. ప్రవేశాలకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలు, సీట్ల కేటాయింపు ప్రక్రియ వివరాలను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే విడుదల చేసింది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూసేందుకు సమన్వయం చేసుకున్నట్లు మండలి కార్యదర్శి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, విశ్వవిద్యాలయాల అధికారిక వెబ్‌సైట్లను, కౌన్సెలింగ్ మార్గదర్శకాలను, ఫీజులను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు.
అడ్మిషన్ షెడ్యూల్ వివరాలు:
నోటిఫికేషన్ విడుదల: జులై 19
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు10
టీజీ ఈఏపీసెట్ 2025 మొదటి దశ సీట్ల కేటాయింపు: జూలై 18
తుది దశ కేటాయింపు: ఆగస్టు10 లోపు
జోసా 2025 తుది రౌండ్ (రౌండ్ 6) కేటాయింపు: జూలై 16
సీసాబ్-2025 రౌండ్ 1 కేటాయింపు ఫలితం: ఆగస్టు 9 న
తరగతుల ప్రారంభం: ఆగస్టు 14






