Suravaram Sudhakar: కామ్రెడ్‌ ఇక సెలవు.. ముగిసిన సురవరం అంతిమయాత్ర

by Prasad Jukanti |

కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ముగిసింది.

Suravaram Sudhakar: కామ్రెడ్‌ ఇక సెలవు.. ముగిసిన సురవరం అంతిమయాత్ర
X

దిశ, డైనమిక్ బ్యూరో: కమ్యూనిస్టు దిగ్గజం, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) అంతిమ యాత్ర ముగిసింది. హిమాయత్ నగర్‌లోని పార్టీ కార్యాలయం మగ్దూం భవన్ (Makhdoom Bhavan) నుంచి అధికారిక లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. గాంధీ మెడికల్ కళాశాలకు (Gandhi Medical College) చేరింది. అంతకు ముందు సురవరం భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గౌరవ సూచకంగా పోలీసులు ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు, సీపీఐ కార్యకర్తలు, నాయకులు, దారి పొడవునా అశ్రునయానాల మధ్య అంతిమ యాత్ర కొనసాగింది. రెడ్ ఆర్మీతో సురవరానికి సీపీఐ ఘన వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా 'కామ్రేడ్ అమర్ రహే' అంటూ నినాదాలు చేస్తూ ఎర్ర జెండాల కవాతు నిర్వహించారు. అనంతరం సురవరం భౌతిక కాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు.

Next Story