క్లైమాక్స్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. త్వరలో ఆ ఇద్దరిపై తీర్పు

by Prasad Jukanti |

క్లైమాక్స్ కు ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ.. త్వరలో ఆ ఇద్దరిపై తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారం (Telangana MLA Defection Case) చివరి దశకు చేరుకుంది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అంటూ దాఖలైన పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) విచారణ ముగిసింది. ఇవాళ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‍పై దాఖలైన పిటిషన్‍పై స్పీకర్ విచారణ జరిపారు. ఈ విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై విచారణ ముగియగా వారికి స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. పెండింగ్‍లో ఉన్న స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పిటిషన్ పై విచారణ సైతం ఇటీవలే ముగిసింది. తాజాగా దానం నాగేందర్ పిటిషన్ విచారణ ముగియడంతో ఈ ఇద్దరికి సంబంధించి త్వరలోనే స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు.

Next Story