యువతకు ఉపాధి.. కేటీఆర్ కీలక ప్రకటన

by Sathputhe Rajesh |   (  Updated:2023-06-14 15:55:14  IST  )

యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ హబ్‌ల నిర్మాణాలు చేపట్టింది.

యువతకు ఉపాధి.. కేటీఆర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ హబ్‌ల నిర్మాణాలు చేపట్టింది. అయితే ఇప్పటికే సిద్ధిపేటలో పూర్తయిన ఐటీ హబ్ నిర్మాణాన్ని రేపు మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు. జూలైలో నిజామాబాద్, అగస్టులో నల్గొండలో ఐటీ హబ్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను యువతకు చేరువ చేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టైర్ 2 నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ఐటీ హబ్ లను నిర్మించిందన్నారు.

Also Read..

గెలుపు కష్టమే! బీఆర్ఎస్ సిట్టింగులు, లీడర్లలో టెన్షన్

Next Story