- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మికుడి కుటుంబానికి అండగా ఉద్యోగులు.. రూ.300 విరాళానికి TGSRTC సర్క్యులర్
గత సమ్మె కాలంలో ఆత్మహత్యకు పాల్పడిన నర్సంపేట డిపో డ్రైవర్ కె.శంకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో జరిగిన సమ్మె కాలంలో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ రీజియన్, నర్సంపేట డిపో డ్రైవర్ దివంగత కె.శంకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. శంకర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు సంస్థలోని ఆసక్తి గల ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. కార్మిక యూనియన్ల అభ్యర్థన మేరకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల మే నెల జీతం బిల్లుల నుండి రూ. 300 చొప్పున రికవరీ చేయాలని ఆదేశిస్తూ సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేశారు.
ఈ విరాళాల సేకరణ పూర్తిగా స్వచ్ఛందమని, ఏ ఉద్యోగిని కూడా బలవంతం చేయరాదని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. విరాళం ఇవ్వడానికి ఆసక్తి చూపే సిబ్బంది నుంచి ఆప్షన్ ఫారాలు (Consent Forms) సేకరించి, వాటిని ఆడిట్ రికార్డుల కోసం భద్రపరచాలని అన్ని డిపోలు, యూనిట్ అధికారులను ఆదేశించారు. సేకరించిన మొత్తాన్ని నిర్ణీత అకౌంట్ హెడ్‌కు జమ చేయాలని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించిన శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు కార్మికులంతా గర్వంగా భావిస్తున్నారని ఆర్టీసీ యూనియన్ నేతలు పేర్కొన్నారు.






