- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బిల్లులపై డిప్యూటీ CM భట్టి కీలక హామీ
ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్‌లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వివరించారు.
ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌తో పాటు రాష్ట్ర స్థాయిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యతను చెప్పారు. ఉద్యోగుల జేఏసీ చైర్మన్, నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన భట్టి.. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక తదితరులు ఉన్నారు.






