- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేం నరేందర్ రెడ్డికి ఉద్యోగుల జేఏసీ అభినందనలు
తెలంగాణ రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సీఎం మాజీ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జాక్ ప్రతినిధులు అభినందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం నుంచి కొత్తగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సీఎం మాజీ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జాక్ ప్రతినిధులు అభినందించారు. గురువారం సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీతో చర్చించారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ.. ప్రభుత్వ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎంపీని కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్ వెంకట్ రెడ్డి, శకుంతల, గీత, టీజీటీఏ అధ్యక్షులు రాములు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు డా.నిర్మల, తపస్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, పెంటయ్య, ప్రైమరీ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, వెంకటేష్, రెవెన్యూ కంప్యూటర్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భూమేష్, రఘుపతి, జీపీవో సంఘం అధ్యక్షులు కే సుభాన్ ఉన్నారు.






