- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ట్విస్ట్.. MP పుట్టా మహేష్‌కు పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం పదకొండు మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా.. అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార టీడీపీ ఎంపీ(ఏలూరు) పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఈగల్ ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు.
ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ‘శనివారం రాత్రి 7:30 గంటల సమయంలో మాకు డ్రగ్స్ పార్టీకి సంబంధించిన సమాచారం అందింది. తెలిసిన వెంటనే అక్కడికి వెళ్లాం. రెండు గ్రాముల కొకైన్ లభ్యమైంది. పార్టీలో పాల్గొన్న అందరికీ టెస్టులు చేశాం. పదకొండు మందిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటాం. డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే ఎవరినీ వదలం’ అని ఈగల్ ఎస్పీ గిరిధర్ కీలక వ్యాఖ్యలు చేశారు.






