డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌తో 1104 విద్యుత్ యూనియన్ నాయకుల భేటీ

by Ramesh Naini |

విద్యుత్ శాఖలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని 1104 విద్యుత్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.

డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క‌తో 1104 విద్యుత్ యూనియన్ నాయకుల భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని 1104 విద్యుత్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి యూనియన్ నాయకులు తమ సమస్యలపై చర్చించారు. అనంతరం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్లాటినం జూబ్లీ జ్ఞాపికను, సావనీర్‌ను, పవర్ మెన్-2026 డైరీని ఆవిష్కరింపజేశారు.

విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు గ్రేడ్ అప్‌గ్రేడేషన్, లీవ్ రూల్స్, కన్వర్షన్ ఈపీఎఫ్ టు జీపీఎఫ్, నూతన వేతన సవరణ కమిటీ ఏర్పాటు, ఇతర ముఖ్య సమస్యలపై భేటీలో చర్చించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి డిఫ్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని 1104 ప్రధాన కార్యదర్శి జి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు వేమూరి వెంకటేశ్వర్లు, అదనపు కార్యదర్శి జి వరప్రసాద్, కోశాధికారి కే శ్రీనివాస్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీ కె సురేంద్ర చారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి రమేష్ ఉన్నారు.

Next Story