గద్వాలలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన

by Dishafeatures2 |
గద్వాలలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన
X

దిశ, ప్రతినిధి గద్వాల: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం, కల్లు అమ్మవద్దనే ఎన్నికల నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఎన్నిక తేది ముందు మద్యం అమ్మడం రెండూ రోజుల నుండి షాప్ లు బంద్ చేయాలనే నిబంధన వున్న , ఎన్నికల అధికారులు కేంద్రాలను సీజ్ చేసిన గద్వాల లో మాత్రం అవేవీ నడువవు అన్నట్టు కల్లు దుకాణాలు తెరిచి కల్లు అమ్ముతున్నారు. కల్లు మాఫియా అధికారుల మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది. నగర పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఉన్న ఈ కల్లు విక్రయ కేంద్రాన్ని మూసివేసేందుకు ఇక్కడి అధికారులకు ఏమాత్రం ధైర్యం చాలడం లేదు.

ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి పట్టణంలో అన్నీ కల్లు కేంద్రాలు నడుస్తోంటే అధికారులు అటువైపు చూడటం లేదు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారి గోపాల్ ను వివరణ కోరగా.. ఎన్నికల నేపథ్యంలో కల్లు దుకాణాలు బంద్ చేయాలని చెప్పామని, అయినా కొంతమంది తెరిచే ఉంచారని, వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Next Story

Most Viewed