13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్.. ఏ జిల్లాలు ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల సమయమే ఉండటంతో జనాలు పల్లెబాట పట్టారు.

13 నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్.. ఏ జిల్లాలు ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల సమయమే ఉండటంతో జనాలు పల్లెబాట పట్టారు. దీంతో ట్రైన్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అయితే ఎన్నికల పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అయి సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తుంది. తాజాగా, అందుతున్న సమాచారం మేరకు కొన్ని జిల్లాల్లో 4 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం వంటి నియోజక వర్గాల్లో ఇది వర్తిస్తుంది. ఈ లిస్టులో దాదాపు 13 నియోజకవర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలింగ్ సమయం వరకు క్యూలో నిల్చున్న వారు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత లైన్‌లో ఉన్నా ఫలితం ఉండదట.

Next Story