ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం

by Prasad Jukanti |

ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (Delhi Telugu Journalist Association) కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టీ. శ్రీనివాసరావు (టీవీ5), వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీ.గోపిక్రిష్ణ (10టీవీ) ప్రధాన కార్యదర్శిగా టీ. సూర్యకిరణ్ (ఆంధ్రజ్యోతి)లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి.కళా శ్రీనివాస్ ( ప్రైమ్ 9 బ్యూరో ) ఎండీ.మదార్ (వీ6 బ్యూరో), కోశాధికారిగా ఏం.వి. శివరావు ( బిగ్ న్యూస్ బ్యూరో), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సత్య (ఆంధ్రప్రభ బ్యూరో), విద్యాసాగర్ వేముల (ఆంధ్రజ్యోతి), ఎస్.నవీన్(99 బ్యూరో)లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొందరు జర్నలిస్టులు కూడా అసోసియేషన్ లోకి రావడానికి సిద్ధంగా వుండటం, వారితో సహా తెలుగు మీడియా లోపనిచేస్తున్న వీడియో జర్నలిస్టులతో కలిపి త్వరలోనే విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, కమిటీని మరింత విస్తరించాలని సమావేశం నిర్ణయించింది. ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు మీడియా జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని మార్గాల ద్వారా ఒక నిర్దిష్ణ కార్యాచరణతో పనిచేయాలని నూతన కమిటీ నిర్ణయించింది.

Next Story