- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాయిలాలపై ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్ ఫోకస్.. మాజీ MLA, ఎమ్మెల్సీ ఇంట్లో మెరుపు సోదాలు
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఇప్పటికే సీఎంతో పాటు మంత్రులు, విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) ముఖ్య నేతలు నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం మునిగి తేలుతున్నారు. డోర్ టూ డోర్ తిరుగుతూ.. తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వం చరమాంకానికి చేరుకున్న వేళ ఓటర్లను తాయిలాలతో మభ్యపెట్టేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం నిరంతరం అన్ని పార్టీల ముఖ్య నాయకుల కదలికలపై ఫోకస్ పెట్టింది.
ఈ క్రమంలోనే ఓటర్లు డబ్బు పంచేందుకు భారీ ఎత్తున డబ్బు నిల్వ చేశారనే సమాచారం మేరకు ఇవాళ ఉదయం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ఇంట్లో ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలిస్తున్నారు. అదేవిధంగా కూకట్‌పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్‌రావు (Ravinder Rao) ఇంట్లో పోలీసులు సోదాలు చేపడుతున్నారు. దీంతో రవీందర్‌రావు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో.. పోలీసులు దుర్మార్గంగా ఎలా తన ఇంట్లోకి వస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతల ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం.






