Elections: తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్

by Ramesh Naini |   (  Updated:2025-02-24 09:19:28  IST  )

ఏపీ, తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Elections: తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా.. మార్చి 3న నోటిఫికేషన్, 20న పోలింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ, తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను (Election Commission) ఎన్నికల సంఘం విడుదల చేసింది. (MLA quota MLC) ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సీఈసీ నిర్వహించనుంది. మార్చి 29లోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ క్రమంలోనే సోమవారం సీఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో జంగా కృష్ణమూర్తి, రామకృష్ణుడు యనమల, పరుచూరి అశోక్‌బాబు, తిరుమలనాయుడు, దువ్వరపు రామారావు రిటైర్‌ కానున్నారు. తెలంగాణలో మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్‌రెడ్డి, ఎగ్గే మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీకాలం ముగియనున్నది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

మార్చి 3న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 10 వరకు నామినేషన్‌ల స్వీకరణ, 11న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 13 వరకు గడువు విధించింది. 20న పొలింగ్ జరగనున్నది. పోలింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగనుంది. పోలింగ్ అనంతరం అదే రోజు కౌంటింగ్ షురూ చేసి.. మార్చి 24 లోపు ఎన్నికల ప్రక్రియ ముగించనున్నది.

Next Story