Election Commission: రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్‌.. సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

by Ramesh Naini |

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేపు (అక్టోబర్ 27) ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.

Election Commission: రేపు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్‌.. సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Election Commission of India) రేపు (అక్టోబర్ 27) ప్రెస్ కాన్ఫరెన్స్ (press meet) నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం 4:15 గంటలకు విజ్ఞాన్ భవన్, న్యూ ఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ కమిషన్ మీడియా ఆహ్వానం విడుదల చేసింది. రేపటి సమావేశంపై రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే, వచ్చే నెలలో జరగనున్న (Bihar elections) బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, బీహార్ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న, ఫలితాల ప్రకటన నవంబర్ 13న జరగనుంది. రేపటి సమావేశంలో ఎలాంటి అంశాల వెల్లడిస్తారోనని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న ఓటు చోరిపై మరోసారి మాట్లాడుతారా? లేదా ఎన్నికల ప్రక్రియపై మాట్లాడుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Next Story