- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో 28 స్థానాలకు ఉప ఎన్నికలు.. ప్రకటించిన ఎన్నికల సంఘం
రాజీనామాలు, సభ్యుల మృతి కారణంగా ఏపీలోని ఖాళీ అయిన పలు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉద్రిక్తతలు, ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి.

రాజీనామాలు, సభ్యుల మృతి కారణంగా ఏపీలోని ఖాళీ అయిన పలు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉద్రిక్తతలు, ఉత్కంఠ మధ్య కొనసాగుతున్నాయి. వీటికి ఇవాళ ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఏర్పడ్డాయి? ఎన్నికలు ఎక్కడ జరగనున్నాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
సోలార్ పంపు సెట్ల ఏర్పాటులో అచ్చంపేట నియోజకవర్గాన్ని భారత దేశానికి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని కరెంట్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపు సెట్లను వంద రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం తలపెట్టిన ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ నూతన కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి చూడండి.
పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న వారిని గుర్తించి అధికారులు అరెస్టులు చేస్తున్నారు. ఇటీవలే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసిన అధికారులు.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు పాక్‌కు కాస్మోటిక్స్, దుస్తులు, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల రవాణా ముసుగులో ఈ చర్యలకు పాల్పడేవాడని అన్నారు. ఇతడి నీచమైన పనుల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేయండి.
జమ్మూకశ్మీర్‌లోని పహెల్గాం టెర్రర్ అటాక్ ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో అతలాకుతలమైన పాకిస్తాన్‌ను క్రికెట్‌లోనూ ఏకాకి చేసే ప్రయత్నంలో బీసీసీఐ మరో అడుగు వేసింది. ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనబోదని సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ఇవాళ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు తెలిపింది. ఈ క్రికెట్ టోర్నీపై పూర్తి సమాచారాన్ని ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.






