విజయ్ దేవరకొండ - రష్మిక రిసెప్షన్‌కు రావొద్దు.. విషయం ఇదే!

by Gantepaka Srikanth |

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

విజయ్ దేవరకొండ - రష్మిక రిసెప్షన్‌కు రావొద్దు.. విషయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) - రష్మిక మందన్న(Rashmika Mandanna)ల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మార్చి 4నహైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, జాతీయ స్థాయి అతిథులు హాజరవుతారని సమాచారం. దీంతో ఈ ఈవెంట్ హై ప్రొఫైల్ కార్యక్రమంగా మారింది. అయితే ఈ సమయంలోనే విజయ్ - రష్మిక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. 'మీ ప్రేమ మాకు ఎంతో విలువైనది. అయితే మీ భద్రత కూడా మాకు ముఖ్యమే. ఇన్విటేషన్ లేని వారు వచ్చి ఇబ్బందులు పడొద్దు. అభిమానుల ఆశీస్సులు ఎక్కడ ఉన్నా తమకు అందుతాయి. అందరి క్షేమమే మాకు ప్రాధాన్యం. దయచేసి ఆహ్వానం లేనివారు రావొద్దు’ అని విజయ్ - రష్మిక జంట అభిమానులకు స్పష్టంగా తెలిపారు.




Next Story