- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో El Nino ఎఫెక్ట్.. అధిక ఉష్ణోగ్రతలు నమోదు
ఎల్‌నినో ప్రభావంతో ఈసారి ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: El Nino ప్రభావంతో ఈసారి ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్టంలో రోజువారీ కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అయ్యాయి. పశ్చిమ తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని. ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మార్చి నుంచి మే వరకు మూడు నెలలు చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది.
ముఖ్యంగా వేడి గాలులు వీస్తాయని తెలిపింది. మార్చి నుంచి మే వరకు వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇది గతేడాది ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు భారీగా కురుస్తుంటాయి. కానీ, గతేడాది ఆగస్టులో ఏ మాత్రం కురవలేదు. తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా దేశంలో సాధారణ వర్షపాతం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదు అయింది. ఎల్‌నినో ప్రభావంతో 2024 జనవరిలో కూడా వర్షాల పడలేదు. ఎల్‌నినో ప్రభావం గత ఏడాది 2023 జులై నుంచి దీని ప్రభావం కొనసాగుతోంది.
- Tags
- El Nino effect






