- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్శటీలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపుకు ప్రయత్నాలు
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అండగా ఉంటుందని టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అండగా ఉంటుందని టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టా రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని యూనివర్శిటీల ర్యాంకులను మెరుగుపరచడానికి కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్శిటీ(ఎస్కేఎల్టీజీహెచ్ యూ), తెలంగాణ ఉన్నత విద్యా మండలి (టీజీసీహెచ్ఈ) సహకారంతో ములుగులోని కొండాలక్ష్మణ్ ఉద్యాన యూనివర్శిటీలో సోమవారం ఒకరోజు వర్క్‌షాప్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు, డీన్‌లు, డైరెక్టర్లు సహా దాదాపు పన్నెండు మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో సంస్థాగత పనితీరును మెరుగుపరచడానికి అవగాహన, సంసిద్ధతను పెంచడమే లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి మాట్లాడుతూ, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు కేవలం సంఖ్యలు మాత్రమే కాదని, అవి ఒక సంస్థ యొక్క విద్యా బలం, పరిశోధనా ఉత్పాదకత, విద్యార్థుల ఫలితాలు, దూరదృష్టిని ప్రతిబింబిస్తాయని అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 ప్రాముఖ్యతను ఆయన ప్రధానంగా చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు ఆకర్షించడంలో జాతీయ ర్యాంకింగ్‌ల పాత్రను ఆయన వివరించారు.
వ్యూహాత్మక ప్రణాళిక, నాణ్యమైన డేటా నిర్వహణ, పనితీరును మెరుగుపరచడానికి స్పష్టమైన బెంచ్‌మార్క్‌లు అవసరమని ఆయన అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) తరహాలో అకడమిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (ఏఎస్ఆర్)ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. అలాగే, తక్కువ పరిశోధన, తక్కువ పీహెచ్‌డీలు, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లను అధిగమించడానికి పరిశోధనా సంస్కృతిని బలోపేతం చేయాలని, అధ్యాపకుల అభివృద్ధి, నైపుణ్యఆధారిత పాఠ్యాంశాలు, బ్రాండ్ బిల్డింగ్‌పై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఎస్కేఎల్టీజీహెచ్ యూ వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి.రాజి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ర్యాంకులను మెరుగుపరచాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. రాజి రెడ్డితో పాటు, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్, పీవీఎన్ఆర్‌టీవీయూ ఉపకులపతి ప్రొఫెసర్ జ్ఞానప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే, టీజీసీహెచ్ఈ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, ఇతర ప్రముఖులు "ఎస్కేఎల్టీజీహెచ్యూ ఎట్ ఏ గ్లాన్స్ పుస్తకాన్ని, మై లాఫ్ట్ మొబైల్ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ఇరిసోర్స్‌లకు ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా యాక్సెస్ ఇస్తుంది. వర్క్‌షాప్‌లో చర్చించిన వ్యూహాలను అమలు చేయడానికి కౌన్సిల్ పూర్తి మద్దతు ఇస్తుందని టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలను తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు.






